పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!

Published on Fri, 03/06/2026 - 12:58

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్‌ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు.  అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18)  తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా  కాపుకాసి అత్యంత  పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్‌ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట  కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర  కలకలం రేపింది.  గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్‌ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.

పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై  బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో  శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.  

ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌

కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ  కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య

మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్‌గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్‌లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు  ఎఎస్‌పీ సునీతా రావత్ తెలిపారు.

గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్‌చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)