Breaking News

ట్రంప్‌ టారిఫ్‌లు.. కేంద్రానికి శశిథరూర్‌ కీలక సూచన

Published on Thu, 01/15/2026 - 12:35

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్‌ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం విషయంలో ఆలస్యం చేయవద్దని శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

అమెరికా సుంకాలపై తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ​ శశిథరూర్‌ స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌ విధిస్తున్న సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని.. మళ్లీ ఇరాన్‌తో వ్యాపారం విషయంలో 25 శాతం సుంకాలు విధిస్తున్నారన్నారు. ఇన్ని టారిఫ్‌లను తట్టుకొని 75 శాతం సుంకాలతో అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యమైనంత ఈజీ కాదు. భారీ నష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)