Breaking News

గవర్నర్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసన

Published on Mon, 02/19/2024 - 10:16

కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కేరళలోని మట్టన్నూరులో ఆదివారం సాయంత్రం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలు నల్లజెండాలు చూపించారు. 

అడవి ఏనుగుల దాడిలో మృతి చెందిన ఆరీఫ్ మహ్మద్ అజీష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాయనాడ్ వైపు వెళ్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలంటూ ఎస్‌ఎప​ఐ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. 

ఈ నేపధ్యంలో కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అక్కడ ఉన్న ఇతర కార్యకర్తలను ఆగ్రహం తెప్పించింది. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను పోలీసులు కొట్టారని, వారి వాహనాలను అడ్డుకున్నారని వారు ఆరోపించారు. సోమవారం కూడా తమ నిరసన ప్రదర్శన కొనసాగుతుందని కార్యకర్తలు తెలిపారు. 

కేరళలోని మనంతవాడి సమీపంలోని నివాస ప్రాంతంలోకి చొరబడిన ఏనుగు ఆరీఫ్ మహ్మద్ అజీష్ అనే వ్యక్తిపై దాడి చేసి, చంపేసింది. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వం మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. 
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)