Breaking News

SEMICON India 2024: ప్రపంచమంతా ఇండియా చిప్‌లు

Published on Thu, 09/12/2024 - 04:55

గ్రేటర్‌ నోయిడా: దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం నోయిడాలో ‘సెమీకాన్‌–2024’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్‌ రంగం విలువ 150 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపారు. 

ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్‌ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్‌ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్‌ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నది తమ ధ్యేయమన్నారు.
 

85 వేల మందికి శిక్షణ  
భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్‌ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.

  ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్‌ పరికరంలో భారత్‌లో తయారైన చిప్‌ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్‌అండ్‌డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్‌(త్రి–డైమెన్షనల్‌ పవర్‌) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. 
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)