Breaking News

పురుషుల ప్రైవేట్‌ పార్ట్స్‌పై ప్రేలాపనలు : సేజల్‌ పవార్‌కు భారీ షాక్‌

Published on Sat, 06/13/2026 - 16:38

పురుషులు ప్రైవేట్‌ పార్ట్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముంబై కేఈఎమ్ (KEM) హాస్పిటల్ వైద్య విద్యార్థిని సేజల్ పవార్ భారీ షాక్‌ తగిలింది. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ‘పురుషుల శవాల’ (Male Cadavers) పై వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.  

ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలే, కేఈఎమ్ హాస్పిటల్‌లో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న సేజల్ పవార్‌ను హాస్పిటల్ యాజమాన్యం 15 రోజుల పాటు నిర్బంధ సెలవుపై పంపింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అంతర్గత కమిటీ, సేజల్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని  తేల్చింది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తిపరమైన బాధ్యతలకు భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. నిర్బంధ సెలవు అనేది తాత్కాలిక నిర్ణయం మాత్రమే. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం సేజల్ తల్లిదండ్రులను హాస్పిటల్‌కు పిలిపించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు.

అసలు వివాదం ఏమిటి?
దాదాపు మూడు నెలల క్రితం రికార్డ్ అయిన ప్రణీత్ మోరే కామెడీ షోకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షోలో ప్రేక్షకురాలిగా ఉన్న సేజల్ పవార్, తన అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) శిక్షణ సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ, మృతదేహాల పురుషాంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం తీవ్రమవ్వడంతో సేజల్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ సేజల్‌, ప్రణీత్‌ మోరే, అదే షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమాన్షు జంగ్రాపై కూడా మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

ఎన్‌సీడబ్ల్యూ: మరోవైపు కనీస మర్యాద లేకుండా, లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా మాట్లాడినందుకు గాను జాతీయ మహిళా కమిషన్ (NCW),  కమెడియన్ ప్రణీత్ మోరే , హిమాన్షు జంగ్రాలకు సమన్లు జారీ చేసింది.

ఇదీ చదవండి: మైనర్‌పై ఫుట్‌బాల్‌ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

రెసిడెంట్ డాక్టర్ల సంఘం  స్పందన
కేఈఎమ్ హాస్పిటల్‌కు చెందిన మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా సేజల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మాటలు వైద్య వృత్తికి తగనివని పేర్కొంది. అలాగే సోషల్‌మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి , వ్యక్తిగత దూషణలను ఆపాలని కోరింది.

ఇదీ చదవండి: డేంజరస్‌ స్టంట్‌ : యెమెన్‌ స్పైడర్ మ్యాన్ దుర్మరణం

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు