Breaking News

Supreme Court: ఇంత కాఠిన్యమా?

Published on Thu, 09/05/2024 - 04:31

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ (పీఎంఎల్‌ఏ) కేసుల దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది.

 పీఎంఎల్‌ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ ఎ.అమానుల్లా, జస్టిస్‌ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్‌ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది.

 ‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్‌ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్‌ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్‌ ఓకా నిలదీశారు. బెయిల్‌ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)