Breaking News

కరూర్‌ తొక్కిసలాటపై సీబీ‘ఐ’ 

Published on Mon, 10/13/2025 - 11:02

సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని కరూర్‌ పెను విషాద తొక్కిసలాట ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై సీబీఐ జరిపే దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్‌ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించడం విశేషం. 

కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్‌లు ఉంటారని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో గత నెల 27వ తేదీన కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్‌ ప్రచార సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారి తీసింది. ఈ కేసును ఐజీ అష్రా కార్గ్‌ నేతృత్వంలోని సిట్‌ విచారిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీవీకే సుప్రీంను కోరింది. కాగా, బీజేపీసహా కొందరు బాధితులు సీబీఐ విచారణను కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేశారు. 

వీరి పిటిషన్‌లను విన్న జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు సిట్‌ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ అరుణా జగదీషన్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ యథావిధిగా కొనసాగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్‌ చేయలేదని ప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీతో పాటు వాదనలు వినిపించిన న్యాయవాది, డీఎంకే ఎంపీ విల్సన్‌ తెలిపారు. కాగా, బాధితులుగా పేర్కొంటూ బాధితులు కానివారు సైతం కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు వేశారన్న విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకునిరావడంతో ఈ అంశంపై విచారణ జరుపుతామని బెంచ్‌ పేర్కొన్నట్లు విల్సన్‌ తెలియజేయడం గమనార్హం.   

ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్‌కు బీజేపీ సపోర్ట్‌!!

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు