అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!

Published on Tue, 12/02/2025 - 13:24

హీరోయిన్‌ సమంత రూతు ప్రభు, రాజ్‌ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్‌ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్‌లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్‌,  ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు.  

తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్‌ నెక్లెస్‌, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టు కున్నారు.  రాజ్‌ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్‌ శైలి పోట్రెయిట్‌కట్‌ డైమండ్‌ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్‌ కట్‌ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు.  

ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్, సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో  అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

అరటి ఆకులో కమ్మటి భోజనం
సమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక  ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం,  పప్పు,కూరలతో కలర్‌పుల్‌గా కనిపించిన  సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు  ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం,  పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్‌లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా  ఈ ఫుడ్‌ను వడ్డించారు.

ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)