మా ఆర్మీలో భారతీయులు ఉండాలనుకోలేదు: రష్యా

Published on Wed, 07/10/2024 - 20:14

ఢిల్లీ: భారతీయ పౌరులు రష్యా దేశ సైన్యంలో భాగం కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్‌  బాబుష్కిన్‌ అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బుధవారం బాబుష్కిన్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘భారతీయ పౌరులు రష్యా సైన్యంలో భాగం కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. ఏజెంట్లు మోసం చేయటం వల్ల కొంత మంది టూరిస్టు విసాలపై వచ్చి రష్యా  ఆర్మీలో చేరుతున్నారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొని చర్యలు తీసుకుంటాం.  ఈ వ్యహారంపై భారత్, రష్యా  ఒకే ఆలోచనతో ఉంది. అందుకే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనుకోవటం లేదు.

మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా సైన్యంలో భారత పౌరులు భాగంకావాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు రష్యా అధికారులు సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. చాలా మంది భారతీ పౌరులు కేవలం డబ్బుల కోసమే రష్యా ఆర్మీలో చేరుతన్నారు. అలాంటి వారిని మేము ఎట్టిపరిస్థితుల్లో కూడా చేర్చుకోము. కేవలం 50 నుంచి 100 మంది భారతీయులు మాత్రమే రష్యా సైన్యంలో ఉన్నారు. ఇది అంత ప్రభావం చూపే విషయం కాదు.  రష్యా ఆర్మీలో సహయకులుగా చేరుతున్న పలువురు భారతీయులకు సరైన విసాలు కూడా లేవు. చాలా వరకు వారంతా టూరిస్ట్‌ వీసా మీద రష్యాకు వస్తున్నారు ’’ అని అన్నారు.

ఇది చదవండి: భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్‌ కీలక నిర్ణయం

ఇక.. రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. రష్యా  ఆర్మీలో ఉన్న భారతీయ పౌరులను విడుదల చేయాలని రష్యా  అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు. దీనిపై రష్యా సైతం సానూకూలంగా స్పందిస్తూ.. తమ ఆర్మీలో  సహయకులుగా పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చింది.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)