పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ యుద్ధం.. చైనా, రష్యా ఆందోళన

Published on Sat, 02/28/2026 - 09:36

ఢిల్లీ: పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్‌ సైన్యం ఆప్ఘన్‌ ప్రజలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.

ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఆందోళన  
పాక్, అఫ్గాన్‌ మధ్య 2,611 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. దీన్ని డ్యురాండ్‌ లైన్‌ అని పిలుస్తుంటారు. అయితే, ఈ సరిహద్దును తాలిబన్లు గుర్తించడం లేదు. ఇటీవల డ్యురాండ్‌ లైన్‌ వద్ద అఫ్గాన్‌ దళాల కాల్పుల్లో 55 మంది తమ సైనికులు మృతి చెందినట్లు పాకిస్తాన్‌ రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు దిగుతున్నారని, తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమ చెక్‌పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.

పాక్‌ ఉప ప్రధానమంత్రి ఇషాక్‌ దార్‌ తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను వారికి వివరించారు. పాక్, అఫ్గాన్‌ సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని ఆయా మంత్రులు స్పష్టంచేశారు. మరోవైపు పాక్‌–అఫ్గాన్‌ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తంచేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని చైనా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. పరిస్థితి మరింత విషమించకముందే సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని కోరింది.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)