Breaking News

క్షమాపణలు చెప్పడానికి సిద్ధం, కానీ.. : డీకే శివకుమార్‌

Published on Tue, 08/26/2025 - 15:59

బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌,‌ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ క్షమాపణలకు సిద్ధపడ్డారు. కానీ, ఆ క్షమాపణలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాదని.. నిజంగా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే చెబుతానని అంటున్నారు. 

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్‌ చర్యలు తీసుకునే ఉండేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా డీకే స్పందించారు.

‘‘బీజేపీని విమర్శించేందుకే నేను ఆ పాట పాడాను. కానీ కొందరు దీనిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడిఉంటే.. అందుకు చింతిస్తున్నాను. నేను క్షమాపణలు చెప్తాను. అయితే అవి రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు అని అన్నారాయన. 

అలాగే గాంధీ కుటుంబం (Sonia Gandhi family), కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని అని స్పష్టం చేశారు.

ఇటీవల అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై చర్చ నడిచింది. ఆ సమయంలో డీకే శివకుమార్‌ విపక్షాల విమర్శలకు బదులిస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ గేయాన్ని ఆలపించారు. ‘నమస్తే సదా వస్తలే మాతృభూమే’ అంటూ ఆయన నోట రావడంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ వారు నినదించారు. కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం ఆ పరిణామాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)