Breaking News

82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?

Published on Mon, 07/13/2026 - 11:22

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. తన వృద్ధాప్య పింఛను విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లిన 82 ఏళ​ వృద్ధుడికి విచిత్ర అనుభవం ఎదురైంది. తన ఖాతాలో అనూహ్యంగా వందల కోట్ల రూపాయలు డబ్బు ఉండటం చూసి షాకయ్యాడు.  అంతేకాదు ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాలో కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉండటంతో విస్తుపోవడం వారి వంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.

ఆ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం..పింఛను విత్‌డ్రాకామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లారు కామేశ్వర్ మిశ్రా అనే పెద్దాయన.  పింఛను డబ్బులు తీసుకున్న తర్వాత, మిశ్రా తన ఖాతాలో ఉన్న మిగిలిన బ్యాలెన్స్ తనిఖీ చేసుకున్నారు.  ఖాతాలో ఏకంగా రూ. 759,69,51,951 (దాదాపు రూ. 759 కోట్లు) బ్యాలెన్స్ చూపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తనతో తోపాటు వచ్చిన దివ్యాగ కుమారుడి ఖాతాలో కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఈ రెండు ఖాతాల్లోని మొత్తం బ్యాలెన్స్ కలిపితే రూ. 1,500 కోట్లకు పైగానే ఉంది.

ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్‌, తలలు పగిలాయ్‌!

ఈ ఊహించని  డబ్బును చూసి, ఆ కుటుంబంతో పాటు సిఎస్‌సి ఆపరేటర్ కూడా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖాతాల్లోకి ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని మిశ్రా పేర్కొన్నారు. ఈ విషయంపై బ్యాంక్ మరియు సంబంధిత అధికారులు విచారణ జరిపి, తప్పును సరిదిద్దాలని ఆయన కోరారు. ప్రభుత్వం, అధికారులు ఈ లోపాన్ని గుర్తించి సరిచేస్తారనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ వింత పరిణామం బ్యాంకింగ్ లేదా సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు, అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

గతంలో గయా జిల్లాలో కూడా 
గయా జిల్లాలోని దెల్హాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఈ-రిక్షా డ్రైవర్ అయిన శివ్ కుమార్ పటేల్ ఖాతాలో ఇదే పద్ధతిలో రూ. 759 కోట్లు జమ అయ్యాయి. వైశాలి ,సమస్తిపూర్ జిల్లాలలో కూడా, కొంతమంది పెన్షనర్ల ఖాతాలలో రూ. 740 కోట్ల నిల్వలు కనిపించాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)