Breaking News

రూ. 30 వేల లంచం, కట్‌ చేస్తే విజిలెన్స్‌ అధికారులే షాక్‌

Published on Wed, 02/25/2026 - 12:55

భువనేశ్వర్‌: ఒడిశాలో వెలుగు చూసిన భారీ అవినీతి తిమింగలం వ్యవహారం కలకలం  రేపింది.  కటక్ సర్కిల్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతికి సంబంధించిన అనేక ప్రదేశాలలో సోదాల సందర్భంగా ఒడిశా విజిలెన్స్  విభాగం  రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఏజెన్సీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.

పాటియాలోని శ్రీ విహార్‌లోని నేచర్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లోని మొహంతి నివాసంలో  బుధవారం విజిలెన్స్ దాడులు జరిగాయి.  భువనేశ్వర్ ఫ్లాట్, భద్రక్‌లోని తల్లిదండ్రుల ఇల్లు, కటక్‌లోని ఆఫీస్ ఛాంబర్‌లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించాయి. దీంతోపాటు, ఆయన ఆఫీస్ డ్రాయర్ నుండి మరో రూ.1.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌లోని రెండంతస్తుల భవనం, సుమారు 130 గ్రాముల బంగారం, ఇతర ఆస్తులను కనుగొన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: గర్ల్‌ ఫ్రెండ్‌ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం

బొగ్గు డిపోను నడపడానికి మరియు బొగ్గు రవాణాకు అనుమతి ఇవ్వడానికి బదులుగా లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత నుండి రూ. 30,000 లంచండిమాండ్‌ చేశాడన్న ఫిర్యాదుదారు ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిందితుడైన ప్రభుత్వ అధికారిని అరెస్టు చేశారు. ఈ విచారణలో భాగంగా తాజా సోదాలు జరిగాయి. దాడి సమయంలో,  లంచంసొమ్మను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో మొహంతిపై అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018లోని సెక్షన్ 7 కింద కేసు నమోదు  చేశారు.

 

 

 

ఇదీ చదవండి: పింక్‌ ప్యారడైజ్‌గా బెంగళూరు, వైరల్‌ వీడియోలు : హీరో ఈయనే

మరోవైపు  2024  జనవరి నుంచి 2025 డిసెంబర్ 31, మధ్య లంచం తీసుకోవడం, ప్రభుత్వ నిధులలో ఆర్థిక అవకతవకలు, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై విజిలెన్స్ విభాగం మొత్తం 416 కేసులు నమోదు చేసిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)