Breaking News

బైక్‌పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా

Published on Mon, 06/16/2025 - 13:57

న్యూఢిల్లీ: ఇటీవలి  కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ  నేపధ్యంలో ఈ  జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా  వైరల్‌ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్‌లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి రివర్స్ పొజిషన్‌లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ  చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది.
 

ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్‌ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం  తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేశారు.

ఇది కూడా చదవండి: జనగణన నోటిఫికేషన్‌ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)