Breaking News

సందడిగా ‘ఎట్‌ హోం’ 

Published on Tue, 01/27/2026 - 04:33

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’కార్యక్రమం సోమవారం సందడిగా జరిగింది. గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథులుగా పాల్గొన్న యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాండెర్‌ లెయన్‌ తదితరులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇచ్చారు. 

ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 విందులో ఈశాన్య భారతానికి చెందిన రకరకాల వంటకాలు ఆహూతులను అలరించాయి. ఈశాన్య సంప్రదాయానికి అద్దం పట్టే పలు సాంస్కృతిక కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. వాటిని అతిథులు ఎంతగానో ఆస్వాదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్య అతిథులతో కలిసి ఈశాన్య కళాకారులతో ముర్ము, రాధాకృష్ణన్, మోదీ ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు.  
 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు