Breaking News

మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!

Published on Mon, 12/18/2023 - 13:16

భారత్‌లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆదివారం కొత్తగా మరో 335 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు.

కరోనాతో కన్నుమూసినవారిలో నలుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కరోనా కొత్త సబ్-వేరియంట్ జేఎన్‌.1 కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్‌-19 మరణాల రేటు 1.19 శాతం. డిసెంబర్ 8న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో పాజిటివ్‌ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్‌డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మీడియాకు తెలిపారు.

కాగా రాష్ట్రంలో బయటపడిన కోవిడ్‌ సబ్-వేరియంట్ జేఎన్‌.1 విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్  అన్నారు. కొత్త వేరియంట్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికురాలిలో నెలరోజుల క్రితమే సబ్-వేరియంట్‌ని గుర్తించారని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. 
ఇది కూడా చదవండి: ఈ ఏటి మేటి మహిళలు వీరే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)