Breaking News

రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డ్యాన్సర్‌ దుర్మరణం

Published on Wed, 11/05/2025 - 10:25

బెంగళూరు: రియాలిటీ షోలలో తన పెర్‌ఫామెన్స్‌తో పేరు తెచ్చుకున్న ప్రముఖ ‍డ్యాన్సర్‌ సుధీంద్ర (30) మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు.  కొత్త కారు కొనుగోలు చేసిన సుధీంద్ర, ఈ ఆనందాన్ని తన సోదరుడితో పంచుకునేందుకు వెడుతుండగా బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలోని పెమ్మనహళ్లి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో  ఆయన కుటుంబం సభ్యులు విచారంలో మునిగిపోయారు.

‘డాన్స్ షో’తో సహా కన్నడ రియాలిటీ షోలతో పేరుతెచ్చుకున్న సుధీంద్ర,కర్ణాటకలోని త్యామగోండ్లు గ్రామానికి చెందిన వాడు. డోబ్స్‌పేటలో ఒక పాఠశాలను కూడా నడుపుతూ ప్రజాదారణ పొందాడు.  సోమవారం కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం పెమ్మనహళ్లిలోని  సోదరుడికి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో, కారులో సాంకేతిక లోపం ఏర్పడింది, దీనితో డ్యాన్సర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తనిఖీ చేస్తుండగా, అటునుంచి వస్తున్న ట్రక్కు అతణ్ని బలంగా ఢీట్టింది. దీంతో అతను  అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని  సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

 

సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ నెట్టింట  సంచలనగా మారింది.  ఇది ప్రమాదం కాదు, హత్య అనే ఆరోపణలు వినిపించాయి. టక్కు వేగంగా లేదనీ, కావాలనే ఢికొట్టినట్టు  కనిపిస్తోందని, లేదంటే డ్రైవర్‌ తాగి ఉన్నాడా?  నిద్ర మత్తులో ఉన్నాడా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి.  ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు కేసు నమోదు చేసిన  డోబ్స్‌పేట పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)