Breaking News

ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!

Published on Mon, 02/23/2026 - 13:56

గుజరాత్‌లోని ద్వారకలోని గోమతి ఘాట్ సమీపంలో అద్భుతమైన నెమలి లాంటి తోక ఉన్న అరుదైన  చేప ఆసక్తికరంగా మారింది. ద్వారకలోని గోమతి నది పవిత్ర జలాలు సాధారణంగా యాత్రికులతో కళకళలాడుతుంటాయి. సోషల్ మీడియాలో ఒక వింత చేప అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడినెమలి పింఛాన్ని పోలిన చేప అంటూ ఇటు భక్తి పారవశ్యాన్ని, ఇటు శాస్త్రవేత్తలలో  ఉత్సుకతను రేకిత్తించింది. అసలేంటీ నెమలి పింఛం పోలిన తోకతో ఉన్న 'నీడిల్ ఫిష్' (Needlefish) కథ తెలుసుకుందాం.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. చూసేందుకు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుని తలపైన ఉండే నెమలి పింఛంలాగే ఉందని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే, అద్భుతంతో పాటు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక చేప నెమలి పింఛంతోకతో కనిపించిన అసాధారణ దృశ్యం  సముద్ర జీవవైవిధ్యంలో వస్తున్న మార్పులకు ఇది ఒక సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

చేప తోకలోని రంగురంగుల విసనకర్ర లాంటి తోకను చూసి స్థానికులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తాయని నిపుణుల అంచనా.శాస్త్రవేత్తల ప్రకారం, ఇది ఒక అరుదైన జన్యుపరమైన మార్పు లేదా పర్యావరణ ప్రభావం వల్ల కలిగిన శారీరక మార్పు అయి ఉండవచ్చు 

ఈ నీడిల్ ఫిష్ శరీరం పొడవుగా, సూదిలా ఉండి,  తోక విసనకర్ర ఆకారంలో ఉండి, నెమలి ఈకల వలె మెరిసే నీలం, పచ్చ రంగులతో కూడి ఉండటం విశేషం. సాధారణంగా నీడిల్ ఫిష్‌లు (Needle Fish) పొడవైన శరీరాలు, పదునైన దవడలు కలిగి ఉంటాయి, కానీ వాటికి ఇంత అందమైన, రంగురంగుల తోకలు ఉండటం చాలా అరుదు. 

ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

ఈ చేప ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగా ఈ జాతి చేపలకు తోక రెక్కలు (Fins) చాలా చిన్నవిగా, రంగు లేకుండా ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన చేపకు తోక భాగం చాలా వెడల్పుగా, స్పష్టమైన రంగులతో ఉంది. కాంతి పడినప్పుడు ఆ తోక నెమలి పింఛంలా మెరుస్తూ కనిపిస్తోంది. గోమతి నది అరబిక్ సముద్రంలో కలిసే చోట (Brackish water) మంచినీరు, ఉప్పునీరు కలిసి ఉంటాయి. వాతావరణ మార్పులు, నీటిలోని లవణీయత (Salinity) మారడం లేదా సముద్ర ప్రవాహాల వల్ల ఇలాంటి అరుదైన సముద్ర జీవులు అప్పుడప్పుడు తీరానికి వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు, సముద్రపు నీరు వేడెక్కడం వల్ల కొన్ని జీవుల ఆవాసాలు మారుతుంటాయి. జన్యుపరమైన మార్పులు (Mutation) లేదా స్థానిక పర్యావరణ ప్రభావం వల్ల ఈ చేప తోక ఇలా భిన్నంగా తయారై ఉండవచ్చు.  దీనిపై సరైన పరిశోధన జరిగితే, భారత తీర ప్రాంతాల్లోని సముద్ర జీవుల పరిణామ క్రమం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.ఇది తెలిసిన జాతిలో ఒక కొత్త రకమా లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా అనేది పక్కన పెడితే, ఈ "నెమలి తోక చేప" మాత్రం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. 

ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

గోమతి ఘాట్: ఈ ఘాట్ సుమారు 100 సంవత్సరాలకు పైగా భక్తులచే పూజించబడుతోంది, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ స్నానం చేసినట్లు నమ్మకం. గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే పవిత్రమైన ప్రదేశం. దీనిని గోమతి సంగమ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం చేసి, తమ పాపాలలన్నీ హరిస్తాయని   భక్తుల విశ్వాసం.
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)