Breaking News

అయోధ్య రాముడి విరాళాల స్కాం వేళ కీలక పరిణామం

Published on Mon, 07/06/2026 - 16:39

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించింది.  

అయోధ్య రామ మందిరం ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. రామ మందిర్ ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 22న మరోసారి సమావేశం కానుంది ట్రస్ట్. సిట్ నివేదికను పరిశీలించనుంది. నిందితులను త్వరగా పట్టుకుని, శిక్షించాలని ట్రస్ట్‌ కోరింది.

ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి గోవిందు గిరి మాట్లాడుతూ.. రామ మందిర్‌పై ఈ ఘటనను ఆధారం చేసుకుని అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. చంపత్రాయ సేవలను అభినందిస్తున్నామని చెప్పారు. దోషులను పట్టుకునే వరకు తాను ట్రస్టులో కొనసాగలేనని చంపత్రాయ్ వెల్లడించారని తెలిపారు. అయోధ్యను కించపరిచేలా ఉండే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. 

మొదట, విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజ్రంగ్ బగ్రాను కొత్త సెక్రటరీగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌ను నియమించారు.

రాజీనామా చేసిన మరో ట్రస్ట్‌ ప్రతినిధి అనిల్ మిశ్రా రాజీనామా కూడా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సిట్ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ట్రస్ట్.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ట్రస్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న డిస్టిక్ మేజిస్ట్రేట్‌కు మరిన్ని అధికారాలను అప్పగించేందుకు ట్రస్ట్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్‌ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు

ఇదీ చదవండి: ఆమీర్‌ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)