‘భారత్‌ ఫెరారీ కారు, పాక్‌ చెత్త ట్రక్కు’.. పాక్‌ ఆర్మీ చీఫ్‌కు రాజ్‌నాథ్‌ కౌంటర్‌

Published on Sat, 08/23/2025 - 07:55

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో, దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది.

తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘రెండు దేశాలూ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. ఒక దేశం మంచి విధానాలు, ముందుచూపు, కష్టించేతత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పర్చుకోగా, మరో దేశం అప్పటి నుంచి ఇప్పటి దాకా చెత్తగానే మిగిలిపోయింది. అది వాళ్ల సొంత వైఫల్యం. ఇదే విషయాన్ని అసిమ్‌ మునీర్‌ స్వయంగా అంగీకరించారని నాకనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మునీర్‌ పోలిక పాకిస్తాన్‌ సమస్యాత్మక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని రాజ్‌నాథ్‌ అన్నారు. ‘పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్, తెలిసో తెలియకో దోపిడీదారు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. అవతరించినప్పటి నుంచీ ఆ దేశానిది ఇదే తీరు. పాక్‌ సైన్యం భ్రమలను మనం తొలగించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.

ఇటీవల అమెరికా పర్యటనలో మునీర్‌ మాట్లాడుతూ.. ‘హైవేపై ఫెరారీ కారు మాదిరిగా మెరుస్తూ వస్తున్న భారత్‌ను, గులకరాళ్ల ట్రక్కు వెళ్లి ఢీకొట్టిందనుకోండి, నష్టం జరిగేది ఎవరికి?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారం చెలరేగింది. భారత్‌ అభివృద్ధి దిశగా సాగుతుండగా, పాకిస్తాన్‌ వెనుకబడి ఉందని, సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారంటూ మునీర్‌పై విమర్శలు వచ్చాయి.

ఆర్మీలో మహిళలకు అనుకూల విధానాలు 
సాయుధ బలగాలతోపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అనే విధానాలను అమలు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. సేవలందించడమే కాదు, నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తున్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో మొదలైన 15 దేశాల మహిళా అధికారుల ఐరాస ఉమెన్‌ మిలటరీ ఆఫీసర్స్‌ కోర్స్‌లో ఆయన మాట్లాడారు. ఐరాస మిషన్లలో వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రెండు వారాలపాటు కొనసాగనుంది.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)