Breaking News

ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: రాజ్‌నాథ్‌ సింగ్‌

Published on Sun, 11/30/2025 - 12:33

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ‘ఆపరేషన్ సిందూర్ 2.0’పై ఊహాగానాలకు దారితీశాయి. భవిష్యత్తులో తలెత్తే ఏ పరిస్థితికైనా దేశ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించినప్పటికీ, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో స్థిరత్వాన్ని అడ్డుకుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని, అయినప్పటికీ, పాకిస్తాన్ మొండితనం కారణంగా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ఆయన పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) విజయాలను హైలైట్ చేస్తూ వెల్లడించిన ప్రెస్ బ్రీఫింగ్‌లో వెలువడ్డాయి. ఈ బ్రీఫింగ్‌లో బీఎస్‌ఎఫ్‌ డీఐజీ విక్రమ్ కున్వర్ మాట్లాడుతూ భారతదేశం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యల కారణంగా పాకిస్తాన్ తన పలు ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను సరిహద్దు ప్రాంతాల నుండి తమ భూభాగంలోకి  తరలించిందని వెల్లడించారు.

ముఖ్యంగా సియాల్‌కోట్, జఫర్వాల్‌లోని పలు మండలాలలో 12 లాంచ్‌ప్యాడ్‌లు పనిచేస్తున్నాయని, ఇతర ప్రాంతాలలో మరో 60 లాంచ్‌ప్యాడ్‌లు ఉన్నాయని ఆయన వివరించారు. 'ఆపరేషన్ సిందూర్ 2.0' కు తాము సిద్ధంగా ఉన్నామని బీఎస్‌ఎఫ్‌ స్పష్టమైన సంకేతాలిచ్చింది. బీఎస్‌ఎఫ్‌ ఐజీ (జమ్మూ ఫ్రాంటియర్) శశాంక్ ఆనంద్ కూడా ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే తదుపరి చర్యకు దళం సిద్ధంగా ఉందని ధృవీకరించారు. యుద్ధ సమయ పరిస్థితులను నిర్వహించడంలో కేంద్ర సాయుధ పోలీసు దళానికి విస్తృతమైన అనుభవం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం మరో సరిహద్దు దాడికి ఆదేశిస్తే పాక్‌కు మరింత నష్టం కలిగించడానికి బీఎస్‌ఎఫ్‌ సన్నద్ధంగా ఉందని అన్నారు. మొత్తంగా చూస్తే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన సూచనలు, బీఎస్‌ఎఫ్‌  చేసినసంసిద్ధత ప్రకటనలు సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. భవిష్యత్తులో పాకిస్తాన్‌పై మరో సైనిక చర్య చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికా: మరోసారి కాల్పులు.. నలుగురి మృతి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)