Breaking News

10వేల కిలోల పేలుడు పదార్థాలు.. డిటోనేటర్లు లభ్యం

Published on Mon, 01/26/2026 - 07:20

జైపూర్‌:  గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్‌లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. 

హార్సౌర్ గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్‌ను 187 సంచుల్లో నింపి ఒక పొలంలో దాచినట్లు గుర్తించారు. నాగౌర్ జిల్లా జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చావా ఈ వివరాలను వెల్లడించారు.

అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు తెలిపారు. ముఖ్యంగా, 2025 నవంబర్‌లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తుచేశారు. హార్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.

అమోనియం నైట్రేట్‌తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు,12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూస్ వైర్లు, 12 కార్టన్లు, ఐదు బండిల్స్ రెడ్ ఫ్యూస్ వైర్లు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎక్స్‌ప్లోజీవ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంత భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)