Breaking News

విద్యార్థుల సమస్యలపై రాహుల్‌ ఆవేదన.. ప్రధాని మోదీకి లేఖ

Published on Wed, 06/11/2025 - 11:11

ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని  రాహుల్‌ కోరారు.

దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం  ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్‌ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే  సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల బీహార్‌లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు.  అక్కడి స్కాలర్‌షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని,  2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్‌షిప్ లభించలేదని రాహుల్‌ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు  చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)