రాహుల్‌ ఆరోపణలపై ఈసీ రియాక్షన్‌.. పటాకులే పేలాయంటూ సెటైర్లు

Published on Thu, 09/18/2025 - 14:05

న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల స్పందించింది. ఆన్‌లైన్‌లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు.. బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం లేదు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ‘‘ ఆ సమయంలో కర్ణాటకలోని ఆలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరిపింది’’ అని పేర్కొంది.

మరోవైపు రాహుల్‌ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం.. నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్‌ ఠాకూర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ భారత్‌ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. 

‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. కానీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు.  ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సుమారు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఠాకూర్‌ విమర్శించారు. హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్న రాహుల్.. చివరికి పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులు క్షమాపణలు కోరడం, మందలించడం ఆయనకు అలవాటైపోయింది అని అనురాగ్‌ ఠాకూర్‌ ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సంచలన ఆరోపణలు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)