లోక్‌సభలో ‘ప్రియాంకం’.. అన్న లేని లోటు తీరుస్తూ..

Published on Wed, 12/17/2025 - 11:49

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్  విదేశీ పర్యటనలో ఉండగా.. ఆయన గైర్హాజరీపై విమర్శలు గుప్పించిన బీజేపీకి సభలో సీన్ రివర్స్ అయింది. తొలిసారి ఎంపీగా అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్‌కు సారధ్యం వహిస్తూ, అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ప్రియాంక తన వాగ్ధాటితో రాహుల్ లేని లోటును భర్తీ చేయడమే కాకుండా, విపక్షాలకు కొత్త ఊపిరి పోశారు.

ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (ఉపాధి హామీ) స్థానంలో కేంద్రం తెచ్చిన ‘జి రామ్ జి’ బిల్లుపై ప్రియాంక  పోరాటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త బిల్లు పేదల ఉపాధి హక్కును హరిస్తుందని, గ్రామ సభల అధికారాలను బలహీనపరుస్తుందని ఆమె సభలో గట్టిగా వాదించారు. నిధుల కేటాయింపులో కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

సభలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార పక్షం ‘కుటుంబం’ పేరుతో చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. ‘గాంధీ మా కుటుంబ సభ్యుడు కాదు. కానీ ఆయన ఈ దేశానికి తండ్రి, మన అందరికీ కుటుంబ సభ్యునితో సమానం’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం బీజేపీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. కేవలం పేరు మార్పుల కోసమే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, చర్చ లేకుండా బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడం ప్రజాస్వామ్యానికే చేటని ఆమె హెచ్చరించారు.

కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రియాంక ఒక అనుజ్ఞురాలైన నాయకురాలిగా  లోక్‌సభలో తనదైన ముద్ర వేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై బీజేపీ చేసే విమర్శలకు గట్టి సమాధానమిస్తూ.. ‘ఒకేసారి చర్చ పెట్టి ఆ అధ్యాయాన్ని ముగించండి’ అంటూ ఆమె విసిరిన సవాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ విదేశాల్లో ఉన్నా, లోక్‌సభలో కాంగ్రెస్ గళం మరింత బలంగా వినబడటంలో ప్రియాంక సక్సెస్ అయ్యారని పలువురు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘సింధూర్‌లో అదే జరిగింది’.. క్షమాపణలు లేవన్న చవాన్ 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)