Breaking News

ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం

Published on Thu, 09/11/2025 - 06:35

రాయ్‌బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్‌’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్‌ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్‌ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. 
 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు