Breaking News

దళితుడిగా పుట్టడమే నేరమా?

Published on Sat, 10/18/2025 - 05:57

కాన్పూర్‌: అధికార బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దళితులపై అణచివేత నానాటికీ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణాలో దళిత ఐపీఎస్‌ అధికారి వై.పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దళితుడైన హరిఓం వాల్మీకిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్యాకాండ మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. 

బాధిత కుటుంబాన్ని బెదిరించి గొంతు నొక్కేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని ఆరోపించాచారు. రాహుల్‌ గాంధీ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరిఓం తండ్రి, సోదరుడు, సోదరితో మాట్లాడారు. సంతాపం ప్రకటించారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను ఇక్కడికి రాకుండా ఉత్తరప్రదేశ్‌ అధికారులు అడ్డంకులు సృష్టించారని రాహుల్‌ ధ్వజమెత్తారు. 

దేశంలో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తొలుత మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఆ దేశంలో దళితుడిగా జని్మంచడమే నేరమా? అనే ప్రశ్న బాధితుల కళ్లల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అకృత్యాలకు పాల్పడిన నేరగాళ్లను కాపాడడం, బాధితులనే శిక్షించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. న్యాయాన్ని గృహ నిర్బంధంలో ఉంచలేరని తేల్చిచెప్పారు. 

హరిఓం వాల్మీకి కుటుంబాన్ని వేధించడం ఇకనైనా మానుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. హరిఓం వాల్మీకి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో ప్రతి బాధితుడికి, అణగారిన వర్గాలకు తన అండదండలు ఉంటాయన్నారు. ఈ పోరాటం కేవలం హరిఓం కోసం కాదని.. అన్యాయానికి తలవంచని ప్రతి గొంతుక కోసం పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. 40 ఏళ్ల హరిఓం వాల్మీకిని ఈ నెల 2న రాత్రిపూట గ్రామస్థులు కొట్టిచంపారు. అతడిని దొంగగా భావించి దాడిచేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.   
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు