Breaking News

రాహుల్ గాంధీ ప్రసంగం.. కూటమికి హెచ్చరిక!

Published on Mon, 06/08/2026 - 23:11

ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.

కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.

బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనుంది.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)