Breaking News

ఎన్నికల హైజాక్‌కు బీజేపీ కుట్ర 

Published on Sat, 07/12/2025 - 05:32

భువనేశ్వర్‌: గత ఏడాది మహారాష్ట్రలో చేసినట్లుగానే ఈసారి బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను హైజాక్‌ చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్నికల విధులు పక్కనపెట్టి కేవలం బీజేపీ ప్రయోజనాల కోసం పని చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్‌ బచావో సమావేశ్‌’లో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు.

 బిహార్‌ శాసనసభ ఎన్నికలను కబ్జా చేయకుండా బీజేపీని అడ్డుకోవాలని విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్ణయించినట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిందని, బిహార్‌లో ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు కొత్తగా కోటి మంది ఓటర్లను ఎందుకు చేరి్పంచారో చెప్పాలని డిమాండ్‌ చేస్తే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.  

బడా బాబుల సేవలో మోదీ సర్కారు  
భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేవలం ఐదారుగురు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ దేశం కేవలం అదానీ, అంబానీ లేదా బిలియనీర్లకే చెందుతుందని రాజ్యాంగంలో ఎక్కడా రాసిపెట్టి లేదని స్పష్టంచేశారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే మోదీ సర్కారు విధానంగా మారిపోయిందని దుయ్యబట్టారు.

 ఒడిశాలోని పూరీలో అదానీ కుటుంబం కోసం జగన్నాథ రథయాత్ర మధ్యలో నిలిపేశారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఒడిశాలో వనరులను బడా కంపెనీలకు ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారని చెప్పారు. జల్, జంగిల్, జమీన్‌(నీరు, అడవులు, భూమి) గిరిజనులకే చెందాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల సర్వం కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని, వారి తరఫున పోరాటం సాగిస్తామని హామీ ఇచ్చారు.  

లౌకికవాదం, సామ్యవాదం
తొలగించే కుట్ర: ఖర్గే   రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలు తొలగించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంవిధాన్‌ బచావో సమావేశ్‌’లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో గిరిజనులు, దళితులు, మహిళలు, యువతకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)