Breaking News

ఎన్నికల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు..!

Published on Sat, 11/08/2025 - 05:16

బంకా: ఓట్లనే కాదు, కాషాయ దళం ఏకంగా ఎన్నికలనే చోరీ చేస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎన్నికల చోరీతోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో చేసినట్లే బీజేపీ చోరీ చేసిందని, గుజరాత్‌లో మళ్లీ మళ్లీ ఇదే జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని జెన్‌ జెడ్‌కు, యువతకు ఆధారాలతో సహా కాంగ్రెస్‌ చూపిస్తుందని, ఇందులో సందేహమే లేదని తెలిపారు. 

బీజేపీ నేతలే లక్ష్యంగా ఆయన మరోసారి ఓట్‌ చోరీ ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ నేతలు కొందరు, బిహార్‌ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్‌లోనూ పాల్గొని ఓటేశారని విమర్శించారు. సంబంధించిన పేర్లు తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. బిహార్‌లోని బంకాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడారు. హరియాణాలో చోటుచేసుకున్న ఓట్‌ చోరీపై కాంగ్రెస్‌ పార్టీ ఆధారాలను అందజేసినా ఎన్నికల కమిషన్‌ మాత్రం ఖండించలేదన్నారు. హరియాణా ప్రభుత్వం చోరీతో ఏర్పాటైన ప్రభుత్వమని ధీమాతో చెప్పగలనన్నారు. 

గతేడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. రాష్ట్ర ఓటరు జాబితాలోని 2 కోట్లకుగాను కనీసం 25 లక్షల నకిలీ పేర్లున్నాయని, బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్‌ ఆ పారీ్టతో కుమ్మక్కయిందని విమర్శించారు. ఈసారి బిహార్‌లో అలా కానివ్వబోమన్నారు. ఇందుకు ప్రజలు అనుమతించరని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్డీయే ప్రభుత్వం యువతను సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేసుకోవాలంటూ ప్రేరేపిస్తోందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు వ్యసనమే రీల్స్‌ అన్నారు. బిహార్‌ రైతులకు బ్యాంకులు రుణాలి్వడం లేదు, రుణాలను మాఫీ చేయడం లేదని భాగల్పూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఆరోపించారు. కానీ, ఇష్టమైన కార్పొరేట్‌ సంస్థల రుణాలను మాత్రం రద్దు చేస్తోందన్నారు. బీజేపీ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. రోజులో 24గంటలూ ప్రధాని మోదీ మొహం చూపించేందుకు టీవీ చానెళ్లకు బీజేపీ భారీగా చెల్లింపులు చేస్తోందని పేర్కొన్నారు.   
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)