Breaking News

పెట్రోల్ , డీజిల్ ధరల షాక్‌ తప్పదా? వైరల్‌ వీడియో

Published on Fri, 03/06/2026 - 18:21

పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో పెట్రోల్‌,డీజిల్‌ రేట్లు భారీగా పెరుగుతాయనే ఆందోళనలు విస్తృతంగా వ్యాపించాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు,  ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య  ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయంతో, అనేక దేశాలలో ఇంధన ధరల పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకునే భారతదేశంపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ  క్రమంలో ముందస్తు  జాగ్రత్తగా  పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి డీజిల్‌ను నిల్వ చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట  వైరల్‌గా మారింది.

ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం  పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి 1,000 లీటర్ల నీటి ట్యాంక్ లో డీజిల్ నింపుతున్నారు. ఇరాన్‌ వార్‌ కారణంగా ఇంధన ధరలు పెరుగుతాయని ఆశించి తానీ  నిర్ణయం తీసుకున్నానని  పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

ఒక వినియోగదారుడు, “బ్రో తన నీటి ట్యాంక్‌ను ప్రైవేట్ పెట్రోల్ పంపుగా మార్చాడు  అని  చమత్కరించగా“, మీరు చెప్పింది పూర్తిగా నిజమే, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. సోదరుడు సరిగ్గా అర్థం చేసుకున్నాడు” అని  మరొకరు కామెంట్‌ చేశారు. మనం మధ్యప్రాచ్యంపై ఎంతగా ఆధార పడుతున్నామో  దీన్ని బట్టి తెలుస్తోంది.  గల్ఫ్‌లో ఒక వివాదంతో పంజాబ్‌లోని ప్రజలు ఇంధనంతో నీటి ట్యాంకులను నింపుతున్నారు. ఈ ఆందోళనలకు చెక్‌పెట్టడానికే ఇండియా 30 రోజుల రష్యన్ చమురు మినహాయింపు కోసం ఒత్తిడి చేస్తోంది  అన్నారు మరో యూజర్‌.

(రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌)

ఇలా ఈ వైరల్ వీడియోకు వేలాది అభిప్రాయాలు , చలోక్తులతోపాటు, ఇంధన భద్రత, ప్రపంచ రాజకీయాలు, పెరుగుతున్నఇంధన ఖర్చుల గురించి అంతర్లీనంగా ఉన్నఆందోళనలను కూడా ప్రతిబింబించడం గమనార్హం. దేశ ప్రజల్లో చాలామందిలో ఇదే ఆందోళన కనిపిస్తోంది. అటు రేట్లు పెరిగిపోతాయనే ఆందోళనతో ఎల్‌పీజీ సిలిండర్లను కూడా ముందుగానే బుక్‌ చేసుకుంటున్న దాఖలాలు  కూడా కనిపిస్తున్నాయి. 

ఇదీ  చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)