Breaking News

చావు అంచున డీఎస్పీ.. చచ్చాక పరిహారం ఎందుకంటూ వీడియో​

Published on Fri, 06/04/2021 - 10:55

పంజాబ్​లో సోషల్ మీడియాను ఓ వైరల్​ వీడియో కుదిపేసింది. నా ట్రీట్​మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్​ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్​, ఫేస్​బుక్​లో వైరల్  అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. 

ఛంఢీఘడ్​: డిప్యూటీ జైలు సూపరిడెంట్​గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్​ సింగ్​కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్​ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఎక్స్​గ్రేషియాపై విమర్శలు
డిప్యూటీ జైలు సూపరిడెంట్​గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్​.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు.  ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్​ ట్రాన్స్​ప్లాంట్​ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్​ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్​ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు.


మూడువారాల తర్వాత..
ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్​మెంట్​తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్​ సింగ్​పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్​ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్​మెంట్​కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్​ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్​కు డిపార్ట్​మెంట్ తరపున  లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్​మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్​ఫ్లాంట్ కోసం హైదరాబాద్​ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్​ అగర్వాల్ ప్రకటించారు.
చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు

Videos

ఫ్యాన్స్ కు భయపడి.. ఎమ్మెల్యే దగ్గుపాటి పరార్..!

కన్ఫ్యూజన్ ఆన్సర్స్.. అర్థమవుతుందా..!

గిల్ దెబ్బకు ఆ ఇద్దరూ అబ్బా!

ఎమ్మెల్యే దగ్గుపాటి క్షమాపణ చెప్పాలి.. లేకపోతే మేమేంటో చూపిస్తాం..

గడువు ముగిసింది.. ఇక ఉద్యమమే..

తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారు

20 ఏళ్ల తర్వాత.. నాగార్జున, పూరి కంబినేషన్లో సినిమా

అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం

Boduppal Incident: భార్య శరీర భాగాలను మూసీలో పడేసిన భర్త

టీడీపీ గూండాల అరాచకం..! నా తమ్ముడిని కత్తులతో..

Photos

+5

వరలక్ష‍్మీ వ్రతం చేసిన హీరోహీరోయిన్ జోడీ (ఫొటోలు)

+5

హైటెక్స్‌లో 5కే రన్‌.. నగరవాసుల సందడి (ఫోటోలు)

+5

జోహార్ఫా రెస్టారెంట్‌లో సందడి చేసిన మహ్మద్‌ సిరాజ్‌(ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 24-31)

+5

పుష్ప మూవీ ఫేమ్ జాలి రెడ్డి బర్త్‌ డే.. సతీమణి స్పెషల్ విషెస్‌ (ఫొటోలు)

+5

కాబోయే మరదలితో రిబ్బన్‌ కట్‌ చేసిన సారా.. సచిన్‌ పుత్రికోత్సాహం (ఫొటోలు)

+5

పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)