Breaking News

‘స్వార్‌గేట్‌’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు

Published on Thu, 03/13/2025 - 16:05

‘స్వార్‌గేట్‌’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

ముందే క్రిమినల్‌ నేపథ్యం  
ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్‌గేట్‌ టెర్మినస్‌ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్‌ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్‌గేట్‌ బస్టాండ్‌లో వేచి ఉండగా బస్‌కండక్టర్‌నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్‌ డాగ్‌ల సహాయంతో శిరూర్‌ తహసీల్‌ పరిధిలో తన స్వస్థలం గుణత్‌ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్‌ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)