Breaking News

పుణె పోర్షే కేసు: ‘నాకేం గుర్తు లేదు.. అ‍ప్పుడు తాగి ఉన్నా..!’

Published on Mon, 06/03/2024 - 09:30

ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. మైనర్‌ బాలుడు తాను మద్యం తాగి కారు నడిపినట్లు అంగీకరించాడని తెలిపారు. మద్యం తాగటం వల్ల తనకు ఏం గుర్తులేదని చెప్పినట్లు  క్రైం బ్రాంచ్‌ పోలీసులు పేర్కొన్నారు.

‘మైనర్‌ బాలుడిని దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి ముందు అతను ఉన్న లోకేషన్‌?, బ్లాక్‌ అండ్ కోసీ పబ్సుల్లో ఉన్నారా?, కారు డ్రైవింగ్‌ చేశారా? ప్రమాదానికి సంబంధించి వివరాలు, సాక్ష్యాలు, బ్లడ్‌ శాంపిళ్లు తారుమారు చేయటం.. ఇలా పలు ప్రశ్నలు అడిగాం. అయితే ఏది అడిగినా ఒకే సమాధానం చెప్పాడు. నాకు ఏం గుర్తు లేదు. నేను అప్పడు తాగి ఉన్నా అని  చెప్పాడు’ అని క్రైం బ్రాంచ్‌ పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక దర్యాప్తులోనే మైనర్‌ బాలుడు, అతని స్నేహితులు రెండ్లు పబ్బుల్లో రూ. 48 వేలు ఖర్చుపెట్టి మరీ మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.  ఇక.. శనివారం మైనర్‌ తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పుణె సీపీ అమితేష్‌ కుమార్‌ తెలిపారు. తన కుమారుడి బ్లడ్‌ శాంపిళ్లకు బదులు ఆమె బ్లడ్‌ శాంపిళ్లు ఇచ్చినందుకు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.  సాసూన్‌ హాస్పిటల్‌ డాక్టర్లే ఆమెచేత ఈ పని చేయించారని అన్నారు. 

ఈ కేసులో అరెస్టైన మైనర్‌ బాలుడి తల్లిదండ్రులను జూన్‌ 5 వరకు పుణె కోర్టు ఆదివారం పోలీసు కస్టడీకి ఆదేశించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)