Breaking News

మరొకరిని బలిగొన్న పూణె వైరస్‌

Published on Thu, 01/30/2025 - 12:29

పూణే: మహారాష్ట్రలో జీబీఎస్‌ వైరస్ (గ్విలియన్-బారే సిండ్రోమ్) మరొకరి ప్రాణాన్ని బలిగొంది. రాష్ట్రంలో జీబీఎస్‌ వైరస్ కారణంగా రెండవ మరణం నమోదయ్యింది. పూణేకు చెందిన ఒక మహిళ జీబీఎస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జీబీఎస్‌ వైరస్ వ్యాప్తి చెందుతోందనడానికి ఉదాహరణగా నిలిచింది.

గతంలో ఈ వైరస్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పూణేలో ఇప్పటివరకు 127 జీబీఎస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పూణేలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు కూడా మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానిత జీబీఎస్‌(Guillain-Barré syndrome) కేసుల సంఖ్య 127కి చేరింది. ఈ వైరస్‌తో బాధపడుతున్న 13 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే వైరస్‌తో షోలాపూర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పూణేలో అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.

షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, విరేచనాలతో బాధపడుతున్న ఒక బాధితుడిని జనవరి 18న ఆసుపత్రిలో చేర్చించారు. అతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

జీబీఎస్‌ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని బారినపడితే శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి.  కండరాల బలహీనత ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జీబీఎస్‌కి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలోనూ ‘లివ్‌ ఇన్‌’కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)