Breaking News

రైతులపైకి టియర్‌ గ్యాస్‌

Published on Fri, 12/06/2024 - 08:38

శంభు: పంజాబ్‌–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. 

సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. 

సిమెంట్‌ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్‌ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు టియర్‌ గ్యాస్‌ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్‌ గ్యాస్‌తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు.

 రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్‌ సింగ్‌ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)