9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

Published on Mon, 02/23/2026 - 12:15

తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త అత్తమామలు వేధింపులకు పాల్పడి, ఇంట్లోంచి గెంటేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.

ఫిర్యాదు ప్రకారం, జ్యోతి పాండే (34)కు  2017లో ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో అనురాగ పాండేతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. తొలి నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే తొలిసారి గర్భం దాల్చింది మొదలు వివాదాలు ప్రారంభమైనాయి. అనుమానంతో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తమిళనాడులో ఉన్నప్పుడు, తన భర్త, అత్త మామలు తనతో గొడవపడి శారీరకంగా దాడి చేశారని కూడా జ్యోతి ఆరోపించింది. 

ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

ఇంతలో జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. తనపై వేధింపుల్లో భాగంగా  మళ్లీ,తనపై దాడి చేశాడని, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని  ఆరోపించింది. తొమ్మిది నెలల గర్భవతిని అయినా, తన ఆరోగ్యం గురించి పట్టించు కోకుండా మానసిక, శారీరక హింసకు పాల్పడ్డారని  ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం తన తల్లి ఇంట్లో ఉండి బెంగళూరుకు తిరిగి వచ్చింది. అయినా తనను అవమానించి, వేధిస్తున్నారంటూ దక్షిణ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళల హెల్ప్‌లైన్‌లో కుటుంబ కౌన్సెలింగ్  తరువాత, కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)