Breaking News

ఢిల్లీ మార్చ్‌కు ప్రకాశ్ రాజ్.. విమానం నుంచి వీడియో సందేశం!

Published on Sun, 11/01/2026 - 12:44

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన మార్చ్‌లో ఆయన పాల్గొననున్నారు.ఢిల్లీ బయలుదేరే ముందు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పంచుకున్నారు. ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో ఎలాంటి మాటలు మాట్లాడకుండా చేతి సంజ్ఞలతో తాను బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలు కూడా రామ్‌లీలా మైదానానికి చేరుకుని నిరసన మార్చ్‌లో పాల్గొనాలని సంకేతాల ద్వారా పిలుపునిచ్చారు.

ఒకరోజు ముందే విడుదల చేసిన మరో వీడియోలో ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ చాలామంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే బదులు సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కనీసం తమ పోస్టులకు వస్తున్న కామెంట్లను అయినా చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ శాంతియుత నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, సర్‌ ప్రక్రియను రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుల పరిరక్షణే ఈ ఉద్యమ లక్ష్యమని చెప్పారు. ఓటు దొంగతనానికి పాల్పడుతున్నవారికి దేశం మౌనంగా ఉండబోదనే సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీలో ఆదివారం రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తుండగా, పశ్చిమ ఢిల్లీలో బీజేపీ ప్రతిమార్చ్ చేపట్టింది. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో మధ్య, న్యూఢిల్లీ ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది పోలీసు సిబ్బంది, పారామిలటరీ బలగాలను మోహరించారు.

ఇదీ చదవండి: Delhi: మొదలైన ‘చలో ఢిల్లీ’ మార్చ్.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)