Breaking News

ఇన్‌ఫ్లూయెన్సర్‌ హఠాన్మరణం : షాక్‌లో ఫ్యాన్స్‌

Published on Thu, 11/06/2025 - 11:54

అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ  ఇష్టం. అలా పాపులర్‌  ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్‌ ఫోటోగ్రాఫర్‌గా సోషల్‌ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు.  10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ,  దురదృష్టవశాత్తు,  32  ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు.  ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్‌కు చెందిన, అనునయ్ సూద్  (Anunay Sood) ఇక లేరన్న వార్త  నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

32 ఏళ్ల అనునయ్ సూద్  ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది.  అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్‌ లాస్ వెగాస్‌లో  ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి

ఎవరీ అనునయ్ సూద్ 
అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, గ్లోబల్‌ ఫోటోగ్రాఫర్, ఇన్‌స్టాగ్రామ్‌లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్‌ కంటెంట్‌, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్‌తో ఎంతోమంది  ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా  మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా  టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్‌ది. లాస్‌ వెగాస్‌లో స్పోర్ట్స్‌ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్‌ ఆయన చివరి పోస్ట్‌. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)