Breaking News

‘ నా భార్య అలిగింది, సెలవులు కావాలి సార్‌’.. ఎస్పీకి మొరపెట్టుకున్న ఇన్‌స్పెక్టర్

Published on Mon, 03/06/2023 - 13:44

లక్నో: హోలీ సందర్భంగా ఫరూఖాబాద్‌ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా, చాలా మంది పోలీసు సిబ్బంది సెలవులు రద్దయ్యాయి. అయితే, పోలీసు శాఖకు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ తన సమస్య విన్నవిస్తూ హోలీ సందర్భంగా 10 రోజుల సెలవు కోరారు. అయితే అతని సమస్య విని అధికారులు, పోలీసులు నవ్వుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నా భార్య అలిగింది సార్‌..
వివరాల్లోకి వెళితే.. ఫరూఖాబాద్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ హోలీ పండుగ నేపథ్యంలో సెలవు కోరుతూ జిల్లా ఎస్పీకు లేఖ రాశారు. అందులో..”హోలీ రోజున నా భార్య తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. గత 22 ఏళ్ల నుంచి హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లమని నన్ను అడుగుతోంది. కానీ ప్రతి హోలీ పండుగకు డ్యూటీ కారణంగా తనని తీసుకెళ్లడం కుదరలేదు. ఈ సారి మాత్రం పండగకి తన ఇంటికి తీసుకువెళ్లాలంటూ పట్టుబట్టింది.

దీంతో ఆమె నాపై అలిగింది.. కోపంతో రగిలిపోతుంది. ఈ కారణంగా.. నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను అర్థం చేసుకుని పది రోజలు సెలవు ఇవ్వాలని ” రాసుంది. ఈ లేఖ పోలీసు సూపరింటెండెంట్ చేరడంతో, అతను లేఖను చదివి నవ్వాడు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ అభ్యర్థనను పరిశీలించి ఐదు రోజుల సెలవును ఆమోదించారు. ఆ తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చదవండి: వీడియో: పరీక్షలో చిట్టీలు అందించేందుకు వెళ్లాడు, చివరికి పోలీసులకు చిక్కి..

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)