Breaking News

వందే భారత్‌ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Published on Sun, 09/15/2024 - 08:50

రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్‌15) ఆరు కొత్త వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్‌ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.  

ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్‌ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్‌ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ  పేర్కొంది. 

కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్‌ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.

ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)