Breaking News

ఛఠ్‌ పూజలను కించపర్చారు 

Published on Fri, 10/31/2025 - 06:44

చాప్రా/ముజఫర్‌పూర్‌: బిహార్‌లో కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బిహార్‌ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకొనే ఛఠ్‌ పూజలను ఆ కూటమి కించపర్చిందని మండిపడ్డారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించడం విపక్ష నేతలకు ఇష్టం లేదన్నారు. ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులను కాపాడుతున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ప్రధాని మోదీ గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. బిహార్‌లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఛఠ్‌ పూజకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచి్చందని ఆనందం వ్యక్తంచేశారు. పవిత్రమైన ఈ పండుగపై కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమి విషం కక్కుతోందని, డ్రామా అంటూ నిందలేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.   

వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదు 
మన విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిపక్ష నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు తీరిక చేసుకొని విదేశాలకు యాత్రలకు వెళ్తుంటారు తప్ప అయోధ్యలో రామమందిరాన్ని ఏనాడూ దర్శించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. ఛాయ్‌ అమ్ముకొని బతికిన ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కావడం చూసి విపక్ష నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. తాను అలాంటి వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదన్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)