Breaking News

ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధనం: మోదీ

Published on Sat, 06/22/2024 - 04:36

శ్రీనగర్‌: యోగాను ప్రపంచ శ్రేయస్సుకు పనిచేసే శక్తివంతమైన ఉపకరణంగా నేడు అందరూ భావిస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా జమ్మూకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను మార్చే సామర్థ్యం యోగాకు ఉందన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యోగాను 50 వేల నుంచి 60 వేల మంది వరకు సాధన చేస్తుండటం సాధారణ విషయం కాదని తెలిపారు. 

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని షేర్‌–ఇ–కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(ఎస్‌కేఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంగా యోగా గురించి సాధారణంగా చెబుతుంటారు.

 ఆధ్యాత్మిక కోణాన్ని వదిలేసి ప్రస్తుతానికి, మనం వ్యక్తిగత అభివృద్ధి కోసం యోగాపై దృష్టి పెట్టి, దానిని జీవితంలో ఒక భాగంగా ఆచరించవచ్చు. అలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి సమాజ శ్రేయస్సుకు..అంతిమంగా అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది’’ అని చెప్పారు.

సియాచిన్‌లోనూ యోగా డే
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారులు యోగా చేశారు. పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు దేశవ్యాప్తంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సియాచిన్‌లో, రాజస్తాన్‌లోని థార్‌ ఏడారిలో, సముద్రంలో విమానవాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై సైనికులు యోగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాయుధ సిబ్బంది జల యోగ చేశారు. ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం ‘యోగా ఫర్‌ సెల్ప్‌ అండ్‌ సొసైటీ’.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)