Breaking News

రికార్డులు బద్దలు కొడతాం

Published on Sat, 10/25/2025 - 05:21

పట్నా:  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిని బెయిల్‌పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని బిహార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో సుడిగాలి పర్యటనలు చేశారు. జన నాయక్, భారతరత్న కర్పూరీ ఠాకూర్‌ సొంత గ్రామాన్ని సందర్శించారు. 

సమస్తీపూర్, బెగూసరాయ్‌ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకొనే ‘ఇండియా’ కూటమిని పక్కనపెట్టాలని, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీని ఆ పార్టీ శ్రేణులు ‘జన నాయక్‌’ అని సంబోధించడాన్ని మోదీ తప్పుపట్టారు. జన నాయక్‌ అంటే కర్పూరీ ఠాకూర్‌ మాత్రమేనని స్పష్టంచేశారు. కర్పూర్‌ ఠాకూర్‌కు ప్రజలిచి్చన బిరుదును దొంగిలించే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..  

సుపరిపాలనను ఆదరించాలి  
‘‘2005లో బిహార్‌ ప్రజలు జంగిల్‌రాజ్‌కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్‌ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. నయీ రఫ్తార్‌ 
సే చలేగా బిహార్, జబ్‌ ఫిర్‌ సే ఆయేగీ ఎన్డీఏ సర్కార్‌(ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వస్తే బిహార్‌ కొత్త వేగంతో ముందుకెళ్తుంది)  

వారిలో అహంకారం తగ్గలేదు 
విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్‌బంధన్‌ కాదు.. మహాలాఠ్‌బంధన్‌. ఆర్జేడీ, కాంగ్రెస్‌ నాయకులు అత్యంత అవినీతిపరులు. వారంతా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా వారిలో అహంకారం తగ్గలేదు. సొంత కూటమిలోని పారీ్టలను బయటకు తరిమేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. జంగిల్‌రాజ్‌ వల్ల మహిళలు ఎంతగానో నష్టపోయారు. బాధితులుగా మిగిలారు. 

మహిళల సంక్షేమం, సాధికారత కోసం రిజర్వేషన్‌ బిల్లును తీసుకొస్తే పార్లమెంట్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు వ్యతిరేకించారు. ఆ నాయకులు ఓట్ల కోసం వస్తే తలుపులు మూసివేయండి. మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమికి లేదు. నిజానికి ఆ నాయకులే అసలు సమస్య. గతంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేశారు.  ఆర్జేడీ–కాంగ్రెస్‌ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అప్పటి పాలకులు ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్నారు. కానీ, యువతకు ఉపాధి కలి్పంచలేదు. జంగిల్‌రాజ్‌ నుంచి బిహార్‌కు ఎన్డీఏ విముక్తి కలి్పంచింది. ప్రస్తుతం బిహార్‌ ప్రజలకు లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదు. ఇప్పుడు వారి మొబైల్‌ ఫోన్లలో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి.

నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం  
కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్‌ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. యూపీఏ పాలనతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా నిధులు అందజేశాం. కనీస అవసరాల కోసం ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన బిహార్‌ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. చేపలు, మఖానాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. బిహార్‌ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేశాం. మఖానా సాగు, మార్కెటింగ్‌కు దోహదపడుతోంది. బిహార్‌లో నక్సలిజం సమస్య చాలావరకు తగ్గిపోయింది. గతంలో దాదాపు 18 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. ఇదీ నా గ్యారంటీ.  

పరివార్‌ వల్ల సీతారాం కేసరికి అవమానాలు  
పేద కుటుంబంలో జని్మంచిన నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అందుకు కర్పూరీ ఠాకూర్‌ ఇచి్చన స్ఫూర్తే కారణం. పేదలు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతులుగా మారగలరని ఆయన నిరూపించారు. బిహార్‌కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది. వెనుకబడిన తరగతికి చెందిన కేసరి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, పరివార్‌(నెహ్రూ–గాంధీ కుటుంబం) వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనను బాత్‌రూమ్‌లో బంధించారు. అనంతరం వీధుల్లోకి నెట్టేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని ఆయన నుంచి దొంగిలించారు’’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన పట్ల నిరంతరం విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు బిహార్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, వస్తువుల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. రాబోయే ఛత్‌ పండుగతోపాటు ఆదా
(బచత్‌) ఉత్సవం కూడా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.  
 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)