Breaking News

వాళ్లకు టెర్రరిజమే టూరిజం

Published on Tue, 05/27/2025 - 04:58

భుజ్‌/వడోదర: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత ఆర్మీతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, సైన్యం, పాలకులకు బుద్ధిచెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ దేశ ప్రజలకూ హితవు పలికారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వం, సైన్యానికి ఆదాయ వనరుగా మారిందని, ఇకనైనా మీరు మేల్కొనాలని పాక్‌ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం గుజరాత్‌లో సోమవారం పర్యటించిన ప్రధాని మోదీ దాహోద్, భుజ్, గాం«దీనగర్‌లలో రూ.82,950 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశాక భుజ్, దాహోద్‌లలో బహిరంగ సభల్లో ప్రస ంగించారు. 

పాక్‌ సరిహద్దులోని కఛ్‌ జిల్లాలోనూ మోదీ పర్యటించారు. ‘‘భారత్‌ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంటే పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్నే పర్యాటకంలా ప్రోత్సహిస్తోంది. పాక్‌ ఈ తరహా పంథా కేవలం వాళ్లనే కాదు యావత్‌ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది. పాకిస్తాన్‌ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. మీ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇకనైనా ఉగ్రవాదానికి అంతం పలికేందుకు మీరంతా ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంత జీవనం గడపండి. కడుపారా తినండి. రోటీ కావాలో మా తూటా కావాలో మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని ఒక్కటే అడగదల్చుకున్నా. మేం 11 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు భారత్‌ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నేడు జపాన్‌ను దాటేసి భారత్‌ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరి మీరేం సాధించారు?. మీ పరిస్థితేంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రభుత్వాలు, సైన్యం మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ ధోరణి సరైందో కాదో యువతే నిలదీయాలి. మిమ్మల్ని ఆర్మీ, పాలకులు అంధకారంలోకి నెట్టేస్తున్నారు’’అని మోదీ పాక్‌ ప్రజలకు హితవు పలికారు.  

పక్షం రోజులు వేచి చూశా 
‘‘పహల్గాంలో పాశవిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ కఠిన చర్యల కత్తి పట్టుకుంటుందేమోనని 15 రోజులపాటు వేచి చూశా. కానీ ఉగ్రవాదమే పాకిస్తాన్‌కు తిండిపెడుతోందని స్పష్టమైంది. అందుకే పాక్‌పై దాడులకు మా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. మే 9న భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్‌ దాడులకు తెగిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దాడి చేసి మేం పాక్‌ వైమానిక స్థావరాలను నేలమట్టంచేశాం’’అని మోదీ అన్నారు. తర్వాత మోదీ 1971లో పాక్‌ బాంబుదాడుల్లో ధ్వంసమైన ఎయిర్‌ఫీల్డ్‌ను 72 గంటల్లో పునర్‌నిర్మించిన మధాపార్‌ గ్రామంలోని 300 మంది మహిళలతో మోదీ మాట్లాడారు. వీళ్లు మోదీకి సిందూర్‌ మొక్కను బహూకరించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీనిని నాటుతానని మోదీ చెప్పారు.

మూడు రోడ్‌షోలు 
తొలుత గుజరాత్‌ పర్యటనలో భాగంగా సోమవారం మోదీ ఏకంగా మూడు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఉదయం వడోదరలో భారీ రోడ్‌షో చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను మీడియాకు వెల్లడించి దేశం దృష్టిని ఆకర్షించిన కల్నల్‌ సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, కవల సోదరి షాయనా సున్‌సారా కూడా ఈ రోడ్‌షోలో పాల్గొనడం విశేషం. ఖురేషి స్వస్థలం వడోదరే. రోడ్‌ షో సందర్భంగా జనం జాతీయ జెండాలు చేతపట్టుకుని సైన్యాన్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. మోదీ కారు నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం భుజ్‌లో, అహ్మదాబాద్‌లో కూడా మోదీ రోడ్‌షోలు చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.82,950 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)