Breaking News

విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు

Published on Tue, 12/16/2025 - 09:57

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ‘మన చరిత్రలో గర్వించదగిన క్షణం’ అని ఈ విజయాన్ని  ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సైనికుల అచంచలమైన సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని,ఈ విజయం తరతరాలకు స్ఫూర్తిని అందిస్తూనే  ఉంటుందని ప్రధాని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.
 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ చారిత్రక దినాన్ని పురస్కరించుకుని సాయుధ దళాలకు నివాళులు అర్పించారు. 1971లో దేశానికి విజయాన్ని అందించిన సైనికులకు  దేశమంతా కృతజ్ఞతతో నమస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ వ్యూహాత్మక సంకల్పాన్ని ప్రతిబింబించిందని, సైన్యం, నావికాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని ప్రతిబింబించిందని అన్నారు. వారి శౌర్యం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తి మన జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆయన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

1971, డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 16 వరకు భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ నుండి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్ధంలో భారత సాయుధ దళాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇది ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగిపోవడంతో డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా ప్రకటించారు. అదే రోజున 93 వేల మందికి పైగా పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఇది ఆధునిక సైనిక చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాట్లలో ఒకటిగా నిలిచింది.

ఇది  కూడా చదవండి: హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు!

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)