Breaking News

లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ, ప్ర‌ధాని మోదీ మ‌ధ్య ఆస‌క్తిక‌ర స‌న్నివేశం..

Published on Wed, 06/26/2024 - 16:35

పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మ‌ధ్య ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. 18వ లోక్‌స‌భ స్పీకర్‌గా ఎన్నికైన‌ ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు. ఇక‌ లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విష‌యం తెలిసిందే.

కాగా ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ఎన్నిక ముందు వరకు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ప‌ట్టుబ‌డుతూ వ‌చ్చింది. ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక కోసం ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. చివరికి వాయిస్ ఓటుతో ఎన్డీయే ప్రతిపాదించిన ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

కొత్త‌ స్పీక‌ర్‌ ఓం బిర్లాకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ కుర్చీకి మీరు తిరిగి ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాన‌ని తెలిపారు.రాబోయే ఐదేళ్లలో బిర్లా నాయకత్వంపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. బిర్లా స్నేహపూర్వక ప్రవర్తనను మెచ్చుకున్నారు. ఇది సభలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

మ‌రోవైపు మొత్తం ప్రతిపక్షం, భారత కూటమి తరపున అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్భంగా పార్లమెంటులో ప్రజల అంతిమ గొంతుకగా బిర్లా పాత్రను  అభివ‌ర్ణించారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)