Breaking News

Gaza Issue: డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

Published on Sat, 10/04/2025 - 08:47

న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్‌ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు.  

‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి ,  ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. 

గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని,  ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

 కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్‌కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.

ట్రంప్ ప్రణాళికపై హమాస్‌ కీలక నిర్ణయం..  బందీల అప్పగింతకు మొగ్గు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)