Breaking News

వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్‌!

Published on Fri, 01/23/2026 - 13:55

ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. 

తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్‌ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్‌. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. 

ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. 

ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)