పెళ్లై నాలుగు నెలలే.. యాసిడ్‌ తాగించి, కన్న కొడుకు హత్య

Published on Sat, 07/04/2026 - 11:29

గుజరాత్‌లో తల్లిదండ్రులు 23 ఏళ్ల  కన్న కొడుకును అతి దారుణంగా హత్య చేసి, ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ, ఇది అతని తల్లిదండ్రులు చేసిన హత్య అని తరువాత విచారణలో తేలింది. అయితే పెళ్లైన నాలుగు నెలలకే కొడుకును సొంత తల్లిదండ్రులే కిరాతకంగా ఎందుకు హతమార్చారు? అసలేం జరిగింది?

ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా, గోండల్ తాలూకా పరిధిలోని గుండాల గ్రామంలో జూన్ 30న జరిగింది. మరణించిన వ్యక్తిని రామ్ బాబుభాయ్ బాంభవాగా గుర్తించారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని  కథలల్లారు నిందితులు. కానీ పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం తేలింది. ఇది హత్యకాదు ఆత్మహత్య అని నిర్ధారణ అయింది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత, బాధితుడి భార్య తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల విచారణ ప్రకారం, రామ్‌కు విపరీతమైన తాగుడు అలవాటు ఉండేది. దీనివల్ల అతని తండ్రి బాబుభాయ్ (అతుల్‌భాయ్ ఘుఘాభాయ్ బాంభవా) తల్లి మనీషాబెన్ (అలియాస్ మోటిబెన్)తో తరచుగా గొడవలు జరిగేవి.  మృతుడు తల్లిదండ్రులను నిత్యం వేధించేవాడు. ఈ కోవలోనే ఘటన జరిగిన రోజున కూడా ఇదే విషయంలో తల్లిదండ్రులు అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వివాదం ముదరడంతో, తల్లి రామ్‌ చేత బలవంతంగా యాసిడ్ తాగించగా, తండ్రి అతనిపై దాడి చేసి గొంతు నులిమి చంపేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ నేరాన్ని కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి తండ్రి బాబుభాయ్ స్థానిక రాజకీయ పలుకుబడిని ఉపయోగించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అనుమానం రాకుండా గోండల్ సివిల్ ఆసుపత్రిలో  హడావిడిగా  ప్యానెల్ పోస్ట్‌మార్టం నిర్వహించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు, పలువురు స్థానిక నాయకులను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్‌.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్‌!

అయితే, పోలీసుల సమగ్ర విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలోని వివరాలు ఈ కుట్రను బయట పెట్టాయి. విషప్రయోగం , గొంతు నులిమి చంపడం వల్లే అతను మరణించాడని తేలింది.బాధితుడి భార్య బన్షీబెన్ బాంభవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గోండల్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, తల్లిదండ్రులు బాబుభాయ్, మనీషాబెన్‌లను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. కాగా రామ్ నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు. తండ్రి స్థానికంగా టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్‌ మదర్‌ సునీత సక్సెస్‌ స్టోరీ

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)